బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘స్వాతిముత్యం’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు గణేష్. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రోమోస్ వంటి వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.సినిమా పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. లక్ష్మణ్ కె.కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇదిలా ఉండగా.. నిజానికి ఈ చిత్రానికి ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
“ఈ నిర్ణయం పట్ల మేము సంతోషంగా లేనప్పటికీ, వాయిదా వేయక తప్పడం లేదు. రిలీజ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, రిలీజ్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదు.విడుదల తేదీని ముందుగానే ప్రకటించి, విడుదల ప్రణాళికలతో పూర్తి సిద్ధంగా ఉన్నప్పటికీ పరిశ్రమ గురించి ఆలోచించి మేం వెనక్కి తగ్గుతున్నాము. మహమ్మారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు.
ఇంతకుముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి చూసి,ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మునుపటిలాగ సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము” అంటూ చిత్ర బృందం వెల్లడించింది.
ఇక గణేష్ ,వర్ష బొల్లమ్మ తో పాటు సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?