వార్ కంటే సైరా మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్!

  • September 29, 2019 / 12:43 PM IST

అక్టోబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యేది “సైరా నరసింహారెడ్డి” సినిమా ఒక్కటే అయినా.. హిందీలో మాత్రం సైరాకీ పోటీగా వార్ అనే మరో యాక్షన్ సినిమా కూడా విడుదలవుతోంది. సైరాకీ పోటీగా ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలవుతున్నప్పటికీ.. సౌత్ లో ఆ సినిమాకి అంత క్రేజ్ లేదు. సౌత్ అంటే ఒకే కానీ బాలీవుడ్ లో జనాలు కూడా వార్ మీద కంటే సైరా మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. హృతిక్ రోషన్ & టైగర్ ష్రాఫ్ లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ హీరోస్ ఉన్నప్పటికీ.. జనాలు మాత్రం చిరంజీవి, అమితాబ్, విజయ్ సేతుపతి వంటి సౌత్ హీరోలు ఉన్న సైరా మీదే మక్కువ చూపుతున్నారు.

అందుకు సాక్ష్యం.. బాలీవుడ్ లో నిన్నటి నుండి వార్ ప్రీబుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ.. అవి ఫుల్ అవ్వడానికి ముందే సైరా బుకింగ్స్ ఫుల్ అయిపోవడం బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ ను షాక్ కు గురి చేస్తోంది. విడుదలకు ముందే సైరా ఈరేంజ్ లో డామినేట్ చేస్తోందంటే.. విడుదలైన హిట్ టాక్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు ఇంక.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus