మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సినిమాటిక్ మార్పులు చేస్తున్నారట. అయితే ఈ చిత్ర క్లైమాక్స్ ను మాత్రం దర్శకనిర్మాతలు ఇంకా ఫైనలైజ్ చేయలేదని తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం… ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తే.. సాడ్ క్లైమాక్స్‌తో సినిమాని ముగించాలి… అప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశ పడతారనే ఉద్దేశంతో మెగాస్టార్… ఇందులో మార్పు చేయాలని కోరారట. దీంతో నరసింహ రెడ్డి చావుతో కాకుండా నరసింహ రెడ్డి స్ఫూర్తితో … మళ్ళీ ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా క్లైమాక్స్ ఉండేలా తెరకెక్కించాలని చిత్రయూనిట్ కూడా నిర్ణయించుకుందట. ఇప్పటికే ఈ చిత్రం 75 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.