డిల్లీ బ్యూటీ తాప్సీకి బాలీవుడ్ లోనూ ఎఫైర్ కష్టాలు తప్పడం లేదు. తెలుగులో వరుస సినిమాలు మంచు బ్యానర్ లో చేస్తున్నప్పుడు అమ్మడు మంచు మనోజ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు అప్పట్లో కథనాలు వెలువడిన విషయం దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత అమ్మడు కొన్నాళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉండడమే కాక బాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో ఆమెను పట్టించుకోవడం కాస్త తగ్గించేశారు మన తెలుగు గాసిప్పు రాయుళ్ళు.
అయితే.. ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్ గాసిప్పు రాయుళ్ళు తాప్సీకి తలపోటుగా మారారు. ఆమె తాజా సినిమా “జూడవా 2” నిన్న విడుదలైంది. సూపర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రంలో ఆమెకు జోడీగా నటించిన వరుణ్ ధావన్ తో తాప్సీ చాలా సీరియస్ గా డేటింగ్ చేస్తున్నట్లు ప్రస్తుతం బాలీవుడ్ లో గాసిప్పులు వస్తున్నాయి. తనను బాలీవుడ్ కు పరిచయం చేసిన డేవిడ్ ధావన్ తనకు తండ్రితో సమానమని, ఆయన తనయుడు వరుణ్ ధావన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే తప్పితే వేరే రిలేషన్ ఏమీ లేదని, దయచేసి తనకు వరుణ్ తో ఇలాంటి పనికిమాలిన రిలేషన్స్ అంటగట్టద్దని బ్రతిమిలాడుతోంది తాప్సీ. పాపం తాప్సీ మాట ఎవరైనా విని ఆ గాసిప్పులు ఇక్కడితో ఆపేస్తారా లేక ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.