దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది తాప్సి. అయితే తెలుగులో హీరోయిన్ గా సక్సెస్ కానప్పటికీ తమిళ, హిందీ భాషల్లో రాణిస్తుంది. ఇదిలా ఉండగా తాప్సి తన ప్రేమలో విఫలమయ్యానంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాప్సి ఈ విషయాన్నీ స్పష్టం చేసింది.
తాప్సి ఈ విషయం పై స్పందిస్తూ… “నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నా సీనియర్తో మొదటిసారి ప్రేమలో పడ్డాను. నా స్నేహితులతో పోలిస్తే నా ప్రేమ వ్యవహారం కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. కానీ ఆ అబ్బాయి పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, చదువుకు ఆటంకం కలుగుతుందని చెప్పి నన్ను వదిలేశాడు. ఆ టైములో మా దగ్గర ఫోన్లు కూడా లేవు. మా ఇంటి వెనుక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండీ… రోజూ ఫోన్ చేసి ‘ఎందుకు నన్ను వదిలేస్తున్నావ్?’ అని బోరున ఏడ్చేదాన్ని. ఇది ఎప్పటికీ నేను మరిచిపోలేను. నేను ప్రేమ గురించి ఆలోచించినప్పుడల్లా … అతనే నా జీవితం అని ఊహించుకుంటాను. కానీ దురదృష్టవశాత్తు నా ప్రేమ విఫలమైతే…. బహుశా నాకు కావాల్సిన వ్యక్తి అతను కాదేమో అనుకుంటూ నాకు నేను నచ్చజెప్పుకొంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ‘బద్లా’ అనే చిత్రంతో బిజీగా ఉంది తాప్సి