టాలీవుడ్ లో ఆశించిన స్థాయి స్టార్ డమ్ రాకపోవడంతో బాలీవుడ్ లో అడుగిడిన తాప్సీకి అక్కడి ఆదరణ విపరీతంగా నచ్చేసింది. దాంతో హిట్ అయినా ఫ్లాప్ అయినా అక్కడే వరుస చిత్రాలు చేయడానికి మొగ్గు చూపుతోంది. అందులోనూ “పింక్” లాంటి సూపర్ హిట్ అనంతరం అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే హిందీలో “వొమేనియా” అనే చిత్రాన్ని అంగీకరించింది తాప్సీ. ఈ చిత్రంలో తాప్సీ షూటర్ గా నటించనుంది. తాప్సీతోపాటు కృతిసనన్ కూడా ఈ చిత్రంలో షూటర్ గా నటించనుందట.
ఈ అమ్మాయిలిద్దరికీ షూటింగ్ లో ట్రయినింగ్ ఇచ్చేందుకు ఒలింపిక్స్ ఆడిన కొందరు లేడీ షూటర్స్ ను రంగంలోకి దింపారట. వారి నేతృత్వంలో కొన్ని నెలలపాటు తాప్సీ, కృతి సనన్ షూటింగ్ లో ట్రయిన్ అవ్వనున్నారు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న ఈ చిత్రం నేషనల్ లెవల్ గేమ్స్ లో ఆడవాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల ఆధారంగా రూపొందుతుంది.