హీరోయిన్ అంటే ఏదో చికెన్ షాప్ లో లెగ్ పీస్ ని చూసినట్లుగా ఆకలిగా చూస్తారు జనాలు. ఇద్దరుముగ్గురు హీరోయిన్ల మినహా ఎవరూ పెద్దగా పబ్లిక్ లో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయరు. దాంతో.. హీరోయిన్స్ ను వీలైనంత వీక్ పర్సన్స్ గా చూడడానికి అలవాటుపడిపోయారు జనాలు. టాప్సీ కూడా అదే తరహా అమ్మడు అనుకొన్నాడో ఏమో కానీ.. గోవా ఫిలిమ్ ఫెస్టివల్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన తాప్సీని ప్రశ్నలతో ఇబ్బందిపెడదామనుకున్నాడు ఒకతను.
అందరితో ఇంగ్లీషులో మాట్లాడుతున్న తాప్సీని పిలిచి మరీ “హిందీలో మాట్లాడండి” అని అడగగా.. దానికి తాప్సీ “ఇక్కడ ఎవరికీ హిందీ అర్ధం కాదు.. అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. అయినా నేను సౌత్ ఇండియన్ హీరోయిన్ ని తమిళంలో మాట్లాడమంటారా?” అని ఎదురు ప్రశ్నించింది. తాప్సీ ఎదురు ప్రశ్నకు ఖంగుతిన్న అతను దెబ్బకి సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమా సైన్ చేసిన తాప్సీ.. తెలుగులో నటించడానికి తాను ఎప్పుడు రెడీ అని.. కాకపోతే కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని ఉన్నదని చెప్పుకొచ్చింది.