King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు
- April 28, 2026 / 12:41 AM ISTByPhani Kumar
అక్కినేని అభిమానులు ముఖ్యంగా నాగార్జున అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున 100వ చిత్రం నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకి వచ్చింది. వెర్సటైల్ యాక్ట్రెస్ టబు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు అనేది ఆ అప్డేట్ సారాంశం.
Tabu
తాజాగా ఆమె షూటింగ్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.’వెల్‌కమ్ బ్యాక్ టు హోమ్’ అంటూ చిత్ర బృందం ఆమెకు స్వాగతం పలుకుతూ పోస్ట్ చేసింది.

గతంలో నాగార్జున – టబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నిన్నే పెళ్ళాడతా’ ‘ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ఇందులో ‘నిన్నే పెళ్ళాడతా’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.’సిసింద్రీ’ లో కూడా నాగార్జునతో టబు కలిసి చిందేసింది. అల్మోస్ట్ 28 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో నాగార్జున 100వ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి అని చెప్పాలి.
రా. కార్తీక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ సైలెంట్ గా జరిగిపోయినట్టు టాక్ నడుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ను రివీల్ చేయనున్నారు అని సమాచారం.ప్రస్తుతనికైతే ‘కింగ్ 100’ గానే ఈ సినిమా పిలవబడుతుంది.ఇక నాగార్జున గతేడాది ‘కుబేర’ లో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు.ఫుల్ లెంగ్త్ విలన్ గా నాగార్జున ఆ సినిమాలో కనిపించడం జరిగింది. కానీ అనుకున్న ఫలితం అయితే దక్కలేదు.
నితిన్.. ఇక నో డిలే..!











