Tamanna: ఆ తప్పుల నుంచి పెద్ద గుణపాఠం నేర్చుకున్నా: తమన్నా

  • May 20, 2022 / 03:15 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ అగ్రతారగా గుర్తింపు పొందిన సమంత అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దశాబ్దన్నర కాలం నుంచి అగ్రతారగా కొనసాగుతూ మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి అందరిని మెప్పించిన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన తమన్నా తన కెరియర్ కాస్త వెనక్కి పడటంతో ఎన్నో భిన్నమైన కథలను ఎంపిక

చేసుకుని తిరిగి తన కెరియర్ లో ముందుకు వెళ్లారు.ఈ విధంగా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నటించే అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తమన్నా సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో గుర్తింపు పొందక పోవడానికి కారణం ఏంటో తెలియజేశారు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్‌తో హిమ్మత్ వాలా సినిమా చేసినపుడు ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదని అందుకే అక్కడ విజయం సాధించలేకపోయానని తెలియజేశారు.ఈ విధంగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించినప్పటికీ ఈమెకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదనే చెప్పాలి.

కథల విషయంలో తాను చేసిన తప్పుల నుంచి పెద్ద గుణపాఠం నేర్చుకున్నానని అందుకే అలాంటి తప్పులు జరగకుండా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈమె తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా సీతాకాలం, భోళా శంకర్ సినిమాలు చేస్తోంది. హిందీలో బోలే చుడియాన్‌, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus