బాహుబలి కంక్లూజన్ పదకొండు రోజులుగా విజయయాత్ర కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు కొల్లగొట్టి తెలుగువారు గర్వపడేలా చేస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ఉన్నప్పటికీ ఆమె కొన్ని నిముషాలకే పరిమితమయింది. బాహుబలి బిగినింగ్ లో ఎక్కువ సేపు కనిపించే తమన్నా పార్ట్ 2 కనిపించకపోవడంపై అనేక రూమర్లు వచ్చాయి. నిడివి ఎక్కువ అయిందని తగ్గించారని, గ్రాఫిక్స్ సెట్ కాక తొలిగించారని.. అందువల్ల మిల్కీ బ్యూటీ అలిగిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రాజమౌళి మీద కోపంతో సినిమా ప్రచారం లో పాల్గొనలేదని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై తమన్నా ఈరోజు స్పందించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపడేసింది.
‘‘‘బాహుబలి’ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర ఏంటో నాకు తెలుసు. రాజమౌళి సార్ అంటే నాకు చాలా గౌరవం. అవంతిక పాత్ర కోసం నన్ను ఎంపిక చేయడం పట్ల ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. ఇలాంటి గొప్ప చిత్రంలో నేను కూడా భాగం కావడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా నటిగా నా జీవితాన్నే మార్చేసింది.’’ అని స్పష్టం చేసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.