Tamanna: ఇంతకీ తమన్నా ధరించిన టాప్ కాస్ట్ ఎంతంటే!

  • January 4, 2023 / 06:23 PM IST

మిల్కీబ్యూటీ తమన్నా పెళ్లి గురించిన వార్తలు ఈమధ్య ఎంత వైరల్ అయ్యాయో.. అలాంటి పుకార్లు షికార్లు చేసినప్పుడల్లా ఆమె తన స్టైల్లో ఎలాా రియాక్ట్ అవుతుందో తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తమన్నా ప్రేమలో పడిందంటూ లేటెస్ట్ న్యూస్ ఒకటి బీభత్సంగా చక్కర్లు కొడుతోంది. ఇదిగో ఇదే ప్రూఫ్.. నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుంది? అంటూ తమ క్రియేటివిటీకి పదునుపెట్టి మరీ ఎవరికి వారు తోచినట్టుగా కథనాలు అల్లేస్తున్నారు.

దానికి కారణం తమన్నా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో కలిసి కనిపించడమే.. గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ వర్మతో కలిసి పాల్గొన్న మిల్కీబ్యూటీ అతనికి ముద్దులు పెడుతున్న పిక్స్, వీడియోస్ వైరల్ అవడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ మీడియాతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ వర్మ హిందీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నటించిన MCA మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.

‘పింక్’, ‘గల్లీబోయ్’, ‘సూపర్ 30’, ‘బాఘీ 3’, ‘యారా’ లాంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తమన్నా – విజయ్ ఇద్దరూ ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం ఫస్ట్ టైం కలిశారని.. అప్పుడు ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో డేటింగ్ చేస్తున్నారంటూ మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది.. అందుకే ఈ ప్రేమ పక్షులిద్దరూ నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లారట. ఇదితలా ఉంటే ఈ పార్టీలో తమన్నా వేసుకున్న పింక్ సీక్వెన్ టాప్ గురించి కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

పింక్ సీక్వెన్ టాప్‌లో మిల్కీబ్యూటీ మతాబులా మెరిసిపోయింది.. అమ్మడు కుర్రకారుకి అందాల విందు చేసిన ఈ టాప్ కాస్ట్ వింటే ,టాప్ లేచిపోతుంది.. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా!.. రూ. 2,27,830.. ప్రస్తుతం ఈ పింక్ సీక్వెన్ టాప్‌ అనేది ప్యాషన్ వరల్డ్‌లో ట్రెండ్ అవుతోంది. గతంలో కరణ్ జోహర్ బర్త్‌డే పార్టీలో కూడా ఈ టాప్‌‌తోనే కనిపించింది తమన్నా..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus