తిరస్కారానికి గురైన తమన్నా ప్రేమ!

Ad not loaded.

 టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా తన అందం, అభినయంతో దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.తమన్నా అంటే పడి చచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారని మనకి తెలిసిందే! ఇక తమన్నాకి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, రాకముందు ఎంతమంది అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేసారో తెలియదు కాని తను చదువుకునే రోజుల్లో మాత్రం తనకి షాక్ ఇచ్చిన ఒక అబ్బాయి గురించి మీడియా తో చెప్పింది.
తను చదువుకుంటున్న రోజుల్లో తన ఫ్రెండ్ ఇంటికి రోజు వెళ్తుండేదానినని.., తన అన్నయ్య అంటే తనకి చాలా ఇష్టముండేదని.. నా ఫ్రెండ్ లేని సమయంలో కూడా అతన్ని చూడాలనే వంకతో వాళ్ళ ఇంటికి వెళ్తుండేదాన్నని అయితే ఒక రోజు అతనితో తనని ప్రేమిస్తున్నానని చెప్పగానే ఆ అబ్బాయి వెంటనే ‘నువ్వు నా చెల్లెలు లాంటిదానివని,నా చెల్లి ఫ్రెండ్ నాకు చెల్లెలి వంటిదని, నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పగానే, ఒక్కసారిగా నా గుండె పగిలినంత పనైపోయిందని’ చెప్పుకొచ్చింది. ఇక ఆ షాక్ తో అప్పటి నుండి అబ్బాయిల జోలికి వెళ్లలేదని, ఆ సంఘటన తన జీవితంలో మర్చిపోలేని షాక్ అంటూ తమన్నా మీడియాతో తెలిపింది
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus