మిల్కి బ్యూటీ అనగానే అందరికి గుర్తొచ్చే భామ తమన్నా భాటియా. ముట్టుకుంటే మాసిపోతుందేమో అనేలా ఆమె అందం కుర్రకారును ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకునే ఈ బ్యూటీ అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. సినిమా కోసం తనను తాను ఎలాగైనా మార్చుకుంటుంది. ఇక మిల్కి బ్యూటీ ఇటీవల కోవిడ్ వలన కాస్త బొద్దుగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కాస్త బొద్దుగా కనిపించడంతో ఆమె ఫొటోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి.
అయితే గత రెండు నెలల వరకు దాదాపు చబ్బీగానే కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు పూర్తిగా నాజూగ్గా మారిపోయింది. అందుకు తగిన రహస్యాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. లైట్ వెయిట్ వర్కౌట్స్ చేస్తే చాలని అంటూ మునుపటి ఫిట్నెస్ లోకి రావటానికి అది చాలా బాగా యూజ్ అయినట్లు వివరంగా చెప్పింది. సన్నగా అవ్వడానికి చాలా మంది ఎక్కువగా కష్టపడుతుంటారు. అయితే మరీ అంతలా కష్టపడాల్సి అవసరం లేదని కూడా చెబుతున్న తమన్నా
క్రమం తప్పకుండా నాలా వ్యాయామం చేయగలిగితే చాలని అంటోంది. నిజంగా వీడియోలో తమన్నా రీఫ్రెష్ గా కనిపిస్తున్నట్లు నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఆమె సెక్సీ లుక్ మళ్ళీ వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సీటిమర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.