తమన్నా కూడా ఇంత ఫైర్ అయ్యిందేంటి..!

  • June 11, 2020 / 10:45 PM IST

పెద్దగా హిట్లు లేకపోయినా.. తన డెడికేషన్ అండ్ డ్యాన్స్ తో దర్శక నిర్మాతల్ని ఆకర్షించి.. అందరి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించేసింది. ఇప్పుడు కొత్త హీరోయిన్ల రాకతో సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ.. స్పెషల్ సాంగ్స్, మరియు సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. బిజీగా గడుపుతుంది. తన 15 ఏళ్ళ సినీ కెరీర్లో.. తమన్నా పై ఎన్ని రూమర్స్ వచ్చినా ఎప్పుడూ మండిపడలేదు. కానీ ఈసారి మాత్రం ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.

దానికి కారణం ఈ మధ్య డేటింగ్ వార్తలు ఎక్కువవ్వడం వలనే అని క్లారిటీ ఇచ్చింది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్నా దర్శనమివ్వడంతో అతనితో డేటింగ్ చేస్తుంది అని ప్రచారం జరిగింది. అయితే అది కేవలం ఓ షాప్ ఓపెనింగ్ ప్రమోషన్స్ కోసమే అని వివరణ ఇచ్చింది. అతనితో డేటింగ్ ఏంటి? చిరాకొచ్చేస్తుంది ఇలాంటి వార్తలు వింటుంటే..! అదంతా ట్రాష్ అని కొట్టిపారేసిన తమన్నా.. ఇటీవల కోలీవుడ్ లో వస్తున్న రూమర్స్ తో విసిగిపోతుందట.

అందుకే తన పెళ్ళి గురించి కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నట్టు తెలిపింది. రెండేళ్ల తర్వాతే తన పెళ్లి గురించి ఆలోచిస్తాను… అప్పటి వరకూ నా ధ్యాస అంతా సినిమాలపైనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus