Tamanna, Chiranjeevi: అనౌన్మెంటే లేదు.. అంతలోనే తప్పుకోవడం ఏంటబ్బా..!

  • October 28, 2021 / 01:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘వేదాళం’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ వారితో కలిసి ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు.ఈ చిత్రంలో చెల్లెలి పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నట్టు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.అయితే హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే అంశం పై చాలా రోజులు చర్చ నడించింది.

ఈ క్రమంలో చిరు సరసన తమన్నా నటించబోతున్నట్టు కథనాలు వినిపించాయి. గతంలో ‘సైరా’ సినిమాలో చిరుకి జోడీగా తమన్నా నటించడం జరిగింది. అయితే అది కంప్లీట్ గా హీరోయిన్ పాత్ర అని చెప్పలేము. కానీ తమన్నా కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటే ఆ సినిమా గురించే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా…’భోళా శంకర్’ లో తమన్నా నటిస్తున్నట్టు అటు దర్శకుడు కానీ ఇటు నిర్మాత కానీ అధికారికంగా ప్రకటించింది లేదు. కానీ ఆమె ప్రాజెక్టు నుండీ తప్పుకుంటున్నట్టు ఇప్పుడు మరో వార్త షికారు చేస్తోంది.

‘వేదాళం’ లో ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ బోలెడన్ని ఉంటాయి. మంచి మాస్ పాటలకి కూడా స్కోప్ ఉంటుంది. అలాంటప్పుడు తమన్నా హీరోయిన్ అయితే చిరుతో కలిసి ఆమె అదిరిపోయే స్టెప్పులు వేసుండేది. ఆమెతో స్టెప్పులు వేయాలని ఉన్నట్టు చిరు కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus