“ఎన్టీఆర్ బయోపిక్” షూటింగ్ లో జాయిన్ అయిన తమన్నా!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వెండితెర మీద కనిపిస్తే చాలు.. ఆ సినిమా వందరోజులు ఆడాల్సిందే. అంతలా తెలుగు ప్రజల మనసు దోచుకున్న కథానాయకుడి జీవితం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ  మొదటి పార్ట్ లో సినిమా లైఫ్ ని చూపించబోతున్నారు. ఇందుకు ‘కథానాయకుడు’ అనే అటైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ జనవరి 9 న రిలీజ్ కానుంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంలో చూపించనున్నారు. ఇందుకు మహానాయకుడు అనే అటైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా జనవరి 24 న థియేటర్లోకి రానుంది. ఈ రెండు భాగాల్లో ఎన్టీఆర్ రోల్ పోషిస్తున్న బాలకృష్ణతో పాటు.. ఉండనున్న మరో వ్యక్తి విద్యాబాలన్. ఆమె ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో కనిపించనుంది.

ఇక  ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రంలో నరేష్ నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. శ్రీదేవి పాత్రకోసం రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. అలాగే ఎన్టీఆర్, జయప్రద నటించిన అడవిరాముడు, సూపర్ మ్యాన్, యమగోల తదితర చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ జోడీ కూడా ‘కథానాయకుడు’ లో కనువిందు చేయనుంది. జయప్రద రోల్ కోసం మిల్క్ బ్యూటీ తమన్నాని తీసుకున్నారు. తాజాగా ఆమె షూటింగులో జాయిన్ అయినట్టు తెలిసింది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలు రికార్డులు నెలకొల్పడం ఖాయమని సినీవిశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus