మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కాలంలో రెండు వెబ్ సిరీస్లలో నటించింది. అందులో ఒకటి ‘జీ ఖర్దా’. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండోది ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ . వీటి ప్రస్తావన ఎందుకు ఇప్పుడు? అనే ప్రశ్న మీ మైండ్లోకి వస్తే.. దాని వెనుక సమాధానం కూడా వచ్చేసి ఉండవచ్చు. వాటి గురించే ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. తమన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వెబ్ సిరీస్లలో రెచ్చిపోయి బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించింది.
‘లస్ట్ స్టోరీస్ 2 ‘ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి దాని సంగతి పక్కన పెడితే. ‘జీ ఖర్దా’ లో అయితే హద్దులు మీరు అలాంటి సన్నివేశాల్లో నటించింది. డబుల్ మీనింగ్ డైలాగులకి కూడా కొదవే లేదు. ఇక ‘లస్ట్ స్టోరీస్ 2’ లో అయితే ఇంకా ఓ అడుగు ముందుకేసినట్టు భోగట్టా. కానీ ట్రైలర్లో అంత స్పైసీగా చూపించింది లేదు. కానీ విజయ్ వర్మతో చాలా కాలంగా ఈమె (Tamanna) ప్రేమలో ఉన్నట్లు.. డేటింగ్ కూడా మొదలుపెట్టినట్టు టాక్ నడుస్తుంది.
కాబట్టి ‘లస్ట్ స్టోరీస్ 2’ లో ఇంకా ఘాటైన బెడ్ రూమ్ సీన్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. తమన్నా కూడా నిజమే అన్నట్టు కామెంట్లు చేసింది. ‘నేను కూడా మారాల్సిన టైం వచ్చింది. విజయ్ వర్మతో నటించడం వల్ల.. బోల్డ్ సన్నివేశాల్లో ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. అతను నా జీవితంలోకి ఎంటర్ అవ్వడం నా అదృష్టంగానే భావిస్తున్నాను’ అంటూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమన్నా. ఆమె కామెంట్స్ ను బట్టి.. వీరి బంధం ఇంకా బలపడినట్టు స్పష్టమవుతుంది.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!