Tamanna: మాలీవుడ్ లో మంట పెట్టినా మిల్కీ బ్యూటీ..ఏమి జరిగిందంటే..!

మిల్కీ బ్యూటీ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. గ్లామర్ కు బ్రాండ్. ఎక్కడున్నా అటెన్షన్ అంతా తనవైపే ఉండేలా చూసుకుంటుంది. తప్పకుండా వార్తల్లో ఉండాల్సిందే. దటీజ్ తమన్నా. ఇటీవలే జైలర్ మూవీలో నువ్ కావాలయ్యా పాటలో పిచ్చి క్రేజ్ తెచ్చుకుంది. ఆ పాటలో తమన్న అందాలు చూసి ఫ్యాన్స్ వెర్రెక్కిపోయారు. తన అందాలతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది తమన్నా. ఇప్పటికే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి తనను తాను ప్రూవ్ చేసుకుంది తమన్నా.

కాగా ఇటీవలే మాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. ఆమె రాకతో మాలీవుడ్ హీరోయిన్లు భయపడుతున్నారు. నటుడు దిలీప్ కథానాయకుడిగా నటించిన బాంద్రా అనే మూవీతో హీరోయిన్ గా మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఈ మూవీ ఇటీవలే విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న దిలీప్ కుమార్ తమన్నా గురించి సంచలన కామెంట్స్ చేశాడు.

బాంద్రా మూవీ కోసం మలయాళంలో నటించని హీరోయిన్ తీసుకుందామనుకున్నట్లు తెలిపాడు. గట్స్ ఉన్న పాత్ర అవ్వడంతో నటి తమన్నా అయితో బాగుంటుందని ఆమెను అప్రోచ్ అయినట్లు తెలిపాడు. దర్శకుడు అరుణ్ గోపీ తమన్నాకు కథ చెప్పగా ఆమె ఓకే చెప్పిందన్నారు. (Tamanna) తమన్నా ఓకే చెప్పినప్పటికీ అసలు మూవీలో నటిస్తుందో లేదో డౌట్ గా ఉండేదన్నారు.

ఇదే మూవీ వేరే పాత్ర కోసం మాలీవుడ్ హీరోయిన్ ని అప్రోచ్ అయితే తమన్నా నటిస్తే ఆ మూవీలో నటించనని తెగేసి చెప్పిందన్నారు. ఇలా ఫస్ట్ మూవీతోనే మిల్కీ బ్యూటీ మాలీవుడ్ హీరోయిన్ల గుండెల్లో దడ పుట్టించిందన్నమాట. కాగా మమతా మోహన్ దాస్ బాంద్రా మూవీలో కీ రోల్ లో నటించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చిందట.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus