హాట్ టాపిక్ గా మారిన తమన్నా స్పెషల్ ఫోటోషూట్

పెళ్లిబట్టలంటే నిండైన వస్త్రాధారణ అనే రూల్ లేదు కానీ.. ఉంటే చూడముచ్చటగా ఉండాలి లేదా గౌరవప్రదంగా అయినా ఉండాలి. కానీ.. ఈమధ్య ఫ్యాషన్ పేరుతో వస్తున్న మార్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తరహా మోడ్రన్ పెళ్లికూతురిగా మ్యాగజైన్ కవర్ మీద మెరిసింది మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా. కొత్త తరం పెళ్లి దుస్తులు అంటూ తమన్నా వేసుకొన్న వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.

ప్రస్తుతం చిరంజీవి సరసన “సైరా”లో కథానాయికగా నటిస్తున్న తమన్నా మెల్లమెల్లగా భారీ ఆఫర్లతో బిజీ అవుతోంది. తమన్నా వస్త్రాధారణను ఎవరూ తప్పుబట్టకపోయినా.. ట్విట్టర్ & ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన ఫోటో పోస్ట్ కింద ఆమె ఫ్యాన్స్ & ఫాలోవర్స్ చిత్రవిచిత్రంగా రెస్పాండ్ అవుతూ కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ బట్టి సెక్సీ పెళ్లికూతురిగా తమన్నా కొత్త బట్టలు వాళ్ళకి పెద్దగా నచ్చినట్లు లేవు. వాళ్ళకి నచ్చాయా లేదా పక్కన పెడితే ఆ ఫోటోలు మరియు ఫోటోషూట్ మాత్రం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ డిస్కషన్స్ పుణ్యమా అని తమన్నాకి కాస్త బ్యాడ్ నేమ్ వచ్చినా.. ఆ బ్రాండ్ స్టోర్ & డిజైనర్ కి మాత్రం విశేషమైన స్పందన లభిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus