టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుసగా మూవీ ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కరోజు గ్యాప్ లో తమన్నా నటించిన జైలర్, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆమెకు ఈ సినిమాలకు సంబంధించి వేర్వేరు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వరుసగా సీనియర్ హీరోల సినిమాలలో తమన్నా నటిస్తున్న నేపథ్యంలో సీనియర్ హీరోలతో ఎందుకు నటిస్తున్నారంటూ ఆమెపై ట్రోల్స్ వస్తున్నాయి.
తమన్నా డబ్బు కోసం సీనియర్ హీరోలతో నటిస్తున్నారా? లేక అవకాశాల కోసం సీనియర్ హీరోలతో నటిస్తున్నారా? అనే ప్రశ్నలు ఎదురు కాగా ఆ ప్రశ్నలకు సంబంధించి తమన్నా రియాక్ట్ అవుతూ నటీనటుల వయస్సు వ్యత్యాసం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. నటించే రోల్స్ ను మాత్రమే చూడాలని తమన్నా చెప్పుకొచ్చారు. కాదు కూడదు వయస్సు గురించి మాట్లాడాలంటే హాలీవుడ్ నటుడు ట్రూమ్ క్రూస్ మాదిరి సాహసాలు చేయగలనని తమన్నా తెలిపారు.
తాను డ్యాన్స్ కూడా చేయగలనని తమన్నా వెల్లడించారు. సీనియర్ హీరోలతో నటించడం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా పారితోషికం ప్రస్తుతం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు తమన్నాకు క్రేజ్ పెరుగుతుండగా తమన్నా భారీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.
తమన్నా (Tamannaah) బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించడం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు తమన్నాకు క్రేజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మూడు పదుల వయస్సులో కూడా తమన్నా యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. తమన్నా ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తమన్నా త్వరలో తన పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.