పెద్దగా హిట్లు లేకపోయినా తన డెడికేషన్ అండ్ డ్యాన్స్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ .. స్పెషల్ సాంగ్స్, మరియు సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. బిజీగా గడుపుతోంది. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు కావస్తున్నప్పటికీ తమన్నా క్రేజ్ తగ్గలేదు. ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎటువంటి వార్త వచ్చినా అది వైరల్ అవుతూనే ఉంది.
ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉంటాయి. గతంలో ఈమె పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాలేదు. ప్రస్తుతం తమన్నా వయస్సు 32 సంవత్సరాలు. దీంతో ఆమె పెళ్లి పై ఇంకా ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అనే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చేసింది తమన్నా. విషయంలోకి వెళ్తే.. తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కాబోతుంది.
ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తమన్నాకి తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. “నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. బబ్లీ బౌన్సర్ మూవీ డైరెక్టర్ మధుర్ బండార్కర్ సినిమాల్లో నటించిన ప్రతి ఒక్కరికి అవార్డులు వచ్చాయి, ఈ మూవీతో నాకు కూడా అవార్డు వస్తుందని భావిస్తున్నాను. ఇక నా పెళ్లి విషయంలో ఇప్పటి వరకు ఎవరి నుండి ఒత్తిడి రాలేదు. ఒకవేళ పెళ్లి టైమ్ వస్తే కనుక సంతోషంగా చేసుకుంటాను” అంటూ తెలివైన సమాధానం చెప్పింది.