గ్లామర్ పాత్రలకు ఇక గుడ్ బై : తమన్నా

మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది తమన్నా. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేసిన ‘హ్యాపీ డేస్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెద్దగా హిట్లు లేకపోయినా కానీ తమన్నా కి వరుస అవకాశాలు వచ్చాయి. ఇంత లక్ మారే హీరోయిన్ కీ దక్కదు అనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్,రాంచరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరి స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది తమన్నా. అయితే ప్రస్తుతం చిన్న సినిమా , పెద్ద సినిమా అనే తేడా లేకుండా అవకాశం వస్తే చాలు అన్నట్లు ప్రతీ సినిమాలోనూ నటించేస్తుంది. గతంలో గ్లామర్‌ హీరోయిన్ గా చలామణీ అయిన తమన్నా… ఇప్పుడు మాత్రం కాస్త పెద్ద తరహా పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది. ఇటీవల తమన్నా.. విక్టరీ వెంకటేష్ సరసన నటించిన ‘ఎఫ్2’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ‘బాహుబలి’ చిత్రం పక్కన పెడితే.. తమన్నా కి ఇదే పెద్ద హిట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి తమన్నా ఇలా ఫంథా ఎందుకు మార్చుకోవలసి వచ్చిందని తమన్నాని అడిగితే కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.

తమన్నా ఈ విషయం పై బదులిస్తూ.. ”నా అదృష్టం కొద్దీ తెలుగు ప్రేక్షకులు నాకో స్టార్‌ హోదా కట్టబెట్టారు. కానీ నేనెప్పుడూ ఓ స్టార్‌గా ఫీలవలేదు. నన్ను స్టార్‌ హీరోయిన్‌ అనడం కన్నా… తమన్నా ఓ మంచి నటి అంటేనే నాకు చాలా ఇష్టం. అలాంటి గుర్తింపునే నేను కూడా కోరుకుంటాను. కెరీర్‌ ప్రారంభంలో గ్లామర్‌ పాత్రలు చేయాలి… ఎందుకంటే గుర్తింపుకు అవి అవసరం. కానీ ఇన్ని సంవత్సరాల తరువాత ఇంకా గ్లామర్‌ పాత్రల కోసం ఆరాటపడటం అనవసరం. గ్లామర్‌ తారగా వచ్చిన గుర్తింపు చాలనిపించింది. తమన్నా ఓ మంచి నటి అనిపించుకోవాలని అనిపించింది. అందుకే… ఆ దిశగానే సినిమాలు ఎంపిక చేసుకుంటూ పోతున్నాను. ఇక పై కూడా అలంటి సినిమాలకే ప్రాధాన్యమిస్తాను. తమన్నానేనా ఇలాంటి పాత్ర చేసింది? అని అందరూ ఆశ్చర్యపోతారు కూడా!..” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus