జూన్ 3న “అభినేత్రి” ఫస్ట్ లుక్!

తమన్నా టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం “అభినేత్రి”. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను జూన్ 3న విడుదల చేయనున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నాడు.

తెలుగులో ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ వేడుకను హైద్రాబాద్ లో నిర్వహించనున్నారు. పలువురు సినిమా ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారని తెలుస్తోంది. ఇకపోతే.. తమన్నా ఈ సినిమాలో తన నిజజీవిత పాత్ర అయిన కథానాయిక పాత్ర పోషిస్తుండడం విశేషం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus