Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

గత రెండు రోజులుగా కోలీవుడ్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సినిమాలను ఓకే చేసే విషయంలో కీలకమైన అడుగు వేయడానికి సిద్ధమైపోయారు అని చెబుతున్నారు. చాలా ఏళ్లుగా చర్చల్లోనే ఉన్న టాపిక్‌ విషయంలో ఇప్పటికి హీరోలు ఓ నిర్ణయానికి వచ్చారు అని చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోలు ఈ దిశగా అడుగులు వేసినా.. అది అప్పుడప్పుడే. అయితే ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ ఇదే దిశలో అడుగులు వేస్తారని చెబుతున్నారు. అదే తాము నటించే సినిమాలకు తామే నిర్మాతలు.

Tamil Heros

అందులో కొత్తేముంది చాలా మంది హీరోలు సొంత బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు కదా అనొచ్చు. అయితే ఇప్పుడు టాపిక్‌ ఎవరు నిర్మాత అయినా రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా నిర్మాణంలో పార్ట్‌నర్‌గానే ఉంటారట. ఈ మేరకు అఫీషియల్‌గానే చెప్పేస్తారు అని చెబుతున్నారు. పారితోషికం, బాకీలు, లెక్కలు చిక్కులు లేకుండా పార్ట్‌నర్‌గా లాభాలు తీసుకోడం చేస్తే బెటర్‌ అని అనుకుంటున్నారట. తెలుగులో ఇప్పటికే మహేష్‌బాబు ఇదే పని చేస్తున్నారు. (‘వారణాసి’ సినిమాకు లేదనుకోండి)

తమిళంలో కమల్‌ హాసన్‌ (రాజ్‌ కమల్‌), రజనీకాంత్‌ (లోటస్‌), సూర్య (2డీ ఎంటర్‌టైన్మెంట్‌), ధనుష్‌ (వండర్‌బార్‌), శివకార్తికేయన్‌, విజయ్‌ సేతుపతి, విశాల్‌కి బ్యానర్లు ఉన్నాయి. ఇకపై ఇలా స్టార్లు నటించే సినిమాల పోస్టర్ల మీద ఆ బ్యానర్‌ పేర్లతోపాటు ఈ పేర్లు కూడా కనిపిస్తాయి అని చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి చర్చ జరిగినా, అప్పుడు నిర్ణయాలు అమలు కాలేదు. ఇప్పుడైనా చేస్తారేమో చూడాలి.

ఒకవేళ తమిళనాట ఈ మార్పు జరిగితే.. తెలుగు హీరోలు కూడా ట్రై చేస్తారు అని చెప్పొచ్చు. ఇప్పటికే మన హీరోలు ఎక్కువమంది సన్నిహితుల బ్యానర్ల మీదనే సినిమాలు చేస్తున్నారు. కానీ పారితోషికం లెక్కనే సినిమాలు చేస్తున్నారు. ఇలా లాభాల్లో వాటా సినిమాలు చేస్తున్నాం అని అధికారికంగా చెప్పలేదు. ఇప్పుడు చెబుతారేమో చూడాలి.

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus