ఏ హీరోకి అయినా సరే ప్రమోషన్స్ టీం అనేది ఉంటుంది. అది కీలకంగా ఉంటుంది అని కూడా చెప్పాలి. ఆ హీరో సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని, రిలీజ్ అయ్యేంత వరకు అంతా తమ భుజాలపై మోసేది వీళ్ళే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి కాబట్టి.. పక్క భాషల్లో కూడా మన హీరోలు ప్రమోషన్స్ టీమ్స్ ని పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తమిళ హీరోలని కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకుంటారు.
వారి సినిమాలని నెత్తిన పెట్టుకుంటారు.అందుకే తమిళ హీరోలు చాలా ఏళ్ళ నుండి టాలీవుడ్లో ప్రమోషన్స్ టీంని మెయింటైన్ చేస్తున్నారు. ఈ 40 ఏళ్లలో తెలుగు మార్కెటింగ్ టీంని ఇబ్బంది పెట్టిన తమిళ హీరోలు లేరు అని అంతా అనుకుంటారు. కొంతవరకు అది నిజమే.. కానీ ఒక తమిళ స్టార్ హీరో మాత్రం..కొన్నాళ్లుగా తెలుగు మార్కెటింగ్ టీంని తెగ ఇబ్బంది పెడుతున్నాడట.
నిత్యం వివాదాల్లో ఎక్కువగా నిలిచే ఈ తమిళ స్టార్ హీరో చేసే సినిమాలకి తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. థియేట్రికల్ గా అతనికి ఇక్కడ మంచి సక్సెస్ ..లు ఉన్నాయి. శాటిలైట్, ఇప్పుడు డిజిటల్ తో కలుపుకొని అతని సినిమాలకి మంచి బిజినెస్ అవుతుంది. కానీ అతని మార్కెటింగ్ టీంకి మాత్రం ఇతను పేమెంట్లు వంటివి టైంకి ఇవ్వడట.
అందుకే ఇతని సినిమాలని ప్రమోట్ చేయడానికి ఏ టీం కూడా ముందుకు రావడం లేదు అని వినికిడి. కానీ ఇతను ఓ టీంని పట్టాడు. ఇప్పటికే ఆ టీంతో రెండు సినిమాలు ప్రమోట్ చేయించుకున్నాడు. కానీ అతనికి పేమెంట్లు చేసింది లేదు. సినిమాలు రిలీజ్ అయ్యాక ఇతను కాల్స్ లిఫ్ట్ చేయడం వంటివి చేయడట. దీంతో ఆ తెలుగు మార్కెటింగ్ టీం లభో..దిభో అంటుంది.