తమిళనాడులో బీజేపీ పార్టీకి సినీ హీరోలకు మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. గతంలో స్టార్ హీరో విజయ్, అజిత్ లతో తమిళనాడు బీజేపీ గొడవ పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా హీరో సూర్య మీద విరుచుకుపడింది తమిళనాడు బీజేపీ. అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర యువజన కార్యవర్గం నిన్న ఒక్క సమావేశం నిర్వహించింది. రాబోయే రోజుల్లో అమలు చేయాల్సిన ఏడు తీర్మానాలను ఆమోదించింది.
వాటిలో ఒకటి నీట్ విషయంలో నటుడు సూర్య కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టడాన్ని ఖండించడం. సూర్య గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నీట్ విధానం తమిళనాడులోని పేద విద్యార్థులకు శాపంగా మారుతోందని కామెంట్స్ చేశారు. అప్పుడు సూర్య చేసిన కామెంట్స్ ను ఇప్పుడు బీజేపీ ఖండిస్తూ తీర్మానం చేసింది. సూర్య నీట్ ఎంపిక గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. తన శోథ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారని తీర్మానంలో పేర్కొంది.
సూర్య తన సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకూడదని తమిళ బీజేపీ నేతలు సూర్యకు వార్నింగ్ ఇచ్చారు. అయితే తమిళనాట ప్రజా మద్దతు మాత్రం సూర్యకే ఉంది.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!