ఇప్పుడు టాలీవుడ్ కి ఇండస్ట్రి పెద్ద ఎవరు అంటే.. ఎక్కువ శాతం చిరంజీవి పేరే చెబుతారు. కరోనా టైమ్లో కావచ్చు, టికెట్ రేట్లతో ఇండస్ట్రిలో పెద్ద సినిమాలు ఇబ్బంది పడుతున్న టైమ్లో కావచ్చు.. ఇంకా ఎన్నో విపత్కర పరిస్థితుల్లో చిరంజీవి అండగా నిలబడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇండస్ట్రికి ఓ సమస్య వచ్చింది అంటే.. జనాలు చిరు వద్దకే పరిగెడుతుంటారు.
కానీ సీనియర్ దర్శకుడు, నిర్మాత అయినటువంటి తమ్మారెడ్డి భరధ్వాజ్(Tammareddy Bharadwaja) మాత్రం చిరు ఇండస్ట్రి పెద్ద కాదు అంటూ పలకడం అందరికీ షాకిచ్చినట్టు అయ్యింది.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ..”ఇప్పుడు ఇండస్ట్రిలో పెద్ద అంటూ ఎవ్వరూ లేరు. నందమూరి తారక రామారావు గారు, దాసరి నారాయణ రావు గారు తర్వాత.. ఇండస్ట్రీలో ఓ సమస్య వస్తే వెంటనే పరిష్కరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇండస్ట్రీ జనాలకి కూడా ఎవరి దగ్గరకి వెళ్లాలో తెలీని పరిస్థితి. దాసరి గారు రేంజ్లో ఎవ్వరూ కూడా ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోలేకపోయారు.
కొంత కాలం కృష్ణ గారు ప్రయత్నించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కొంతవరకు సమస్యలు తీర్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి గారు కూడా కొంత వరకు సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించారు. అంతే తప్ప దాసరి రేంజ్లో ఎవ్వరూ కూడా ఇండస్ట్రి అనిపించుకోలేదు. నిజాలు చెబితే ఇప్పుడు కాంట్రోవర్సీగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.
తమారెడ్డి మాత్రమే కాదు ఇండస్ట్రీలో మరికొంతమంది పెద్దలు సైతం చిరు ఇండస్ట్రి పెద్ద అంటే ఏకీభవించని పరిస్థితి. బహుశా చిరు గద్దిస్తూ తీర్పులు తీర్చరు కాబట్టి.. జనాలు అలా అనుకుంటున్నారేమో. ఒకప్పుడు ఎన్టీఆర్, దాసరి ఇండస్ట్రి పెద్దలుగా ఓ వెలుగు వెలిగారు అంటే.. అందరినీ గద్దిస్తూ సమస్యలు తీర్చారు అంటే.. వాళ్ళు పోలిటికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. చిరు అయితే అలా కాదు.
రాజకీయాలకి వివాదాలకి సాధ్యమైనంత దూరంగా ఉండటానికే మక్కువ చూపుతున్నారు. అందుకే ఆయన్ని చాలా మంది ఇండస్ట్రీ పెద్ద అంటే ఏకీభవించకపోవచ్చు.