ఐశ్వర్య రాజేష్ తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లాస్ట్ ఇయర్ 2025 సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ భామ. ఆ మూవీలో భాగ్యం పాత్రకు ఐశ్వర్య చేసిన పెర్ఫామెన్స్ కు థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే రీసెంట్ గా ఈ భామ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది.
అదేంటంటే.. తాజాగా ఐశ్వర్య, తిరువీర్ జంటగా ఒక సినిమా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో కొంత గ్యాప్ దొరకడంతో హీరోయిన్ దోశలు వేస్తూ అందరికి స్వయంగా వడ్డిస్తూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో దోస సరిగ్గా కాలిందా? ఇంకో దోస వేసుకుంటారా అంటూ ఐశ్వర్య అందరితో సొంత మనుషుల్లా కలిసిపోవడం చాలా బాగుంది అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.
గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ 2 అనే వర్కింగ్ టైటిల్ తో మహేశ్వర రెడ్డి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు తో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీ విడుదల అవ్వనుంది.