చాలామంది చాలా అంటుంటారు, అన్నీ పట్టించుకోలేం : తారా చౌదరి

  • August 13, 2018 / 01:44 PM IST

న్యూస్ చానల్స్, న్యూస్ పేపర్స్ కాస్త రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకి “తారా చౌదరి” అనే పేరుని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పేరు ఇది. అయితే.. ఆ పేరు వినిపించి చాలా సంవత్సరాలు కావడంతో జనాలు ఆమె పేరును మర్చిపోయారు. కానీ.. ఉన్నట్లుండి ఆమె పేరు మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ చానల్స్ లో “హీరో రాజశేఖర్ కి తారా చౌదరి”తో సంబంధం ఉంది అంటూ కథనాలు వెలువరించాయి. దాంతో.. ఇప్పుడిప్పుడే శ్రీరెడ్డి చేసిన అసభ్యకరమైన కామెంట్స్ నుంచి బయటకొస్తున్న రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే.. వాళ్ళ అదృష్టం బాగుండడమో లేక తారా చౌదరి కూడా సదరు వీడియోలను చూడడం జరిగిందో తెలియదు కానీ.. ఆమె స్వయంగా ఓ మీడియా చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. “రాజశేఖర్ తో కానీ ఆయన కుటుంబంతో కానీ నాకు అస్సలు సంబంధమే లేదు. ఏదో రెండుసార్లు వాళ్ళ కుటుంబ సభ్యులను మా ఇంటిపక్కన స్థానం అమ్మకం విషయంలో కలిశాను అంతే. నాకు రాజశేఖర్ గారంటే విశేషమైన అభిమానం. అందుకే ఆయన మీద వస్తున్న అభాండాలను ఖండించేందుకు ఇలా మీ ముందుకు వచ్చాను” అని స్పష్టం చేసింది తారా చౌదరి. దాంతో ఊపిరి పీల్చుకున్నారు రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus