సెప్టెంబర్ 21న వస్తొన్న ‘తారామణి’

అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి.వెంకటేష్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 21 న తారామణి విడుదలకు సిద్దమవుతొంది‌.

ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేశ్‌ మాట్లాడుతూ ” తారామణి తమిళ్ లొ సన్సెనషల్ సక్సెస్ ను సాధించిన చిత్రం 35 crores earn ఆండ్రియా బొల్డ్ యాక్టింగ్ కు అక్కడి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా యూత్ తో పాటు లేడీ ఆడియన్స్‌ సైతం తారామణి ని రిపీటెడ్ గా చూడటంతో మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. ఇది మన తెలుగులో అంతకంటే పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకముంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తారామణి టీజర్, సూపర్ స్టార్ రజినీకాంత్ తారామణి పాటలను విడుదల చెశారు. సాంగ్స్ ,ప్రొమోస్ కు యూత్ ను నుంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ వ్యూస్ మిలియన్ మార్క్ ను దాటేశాయి. యువన్ శంకర్ రాజా సంగీతం తారామణి కి మరొ ఎసెట్ గా నిలుస్తుంది. చైన్నై లొ జరిగిన ఓ యదార్ద ప్రేమకథ ఆధారంగా దర్శకుడు రామ్ తారామణి ని తెరకెక్కించాడు.‌ఆద్యంతం వినొదాత్మకంగా ఈ సినిమా ఉంటుందన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus