తేజ దర్శకత్వంలో వెంకటేష్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో ‘ఆట నాదే వేట నాదే’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికలుగా శ్రియ, ఈషా రెబ్బాలు నటించనున్నారు. త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రం కథ గురించి ఒక విషయం తెలిసింది. ఆల్రెడీ ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ గా నటిస్తున్నాడని, నారా రోహిత్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే.. ఇది ఒక వెబ్ సిరీస్ నుంచి ఇన్స్పైర్ అయిన కథ అని తెలుస్తోంది.
అమేజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న “బ్రేకింగ్ బ్యాడ్” అనే సిరీస్ ఆధారం చేసుకొని తేజ అండ్ రైటర్ లక్ష్మీభూపాల్ ఈ కథను సిద్ధం చేసుకొన్నారట. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ప్రొఫెసర్ తన ఫ్యామిలీ కోసమే కాక చికిత్స కోసం కొన్ని తప్పుడు మార్గాల్లో పయనించాల్సి వచ్చినప్పుడు తన తెలివిని ఎలా వినియోగించాడు, దానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా సహాయపడ్డాడు అనేది సినిమా కాన్సెప్ట్. వినడానికి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ కాన్సెప్ట్ సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి.