Teja Sajja: ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ నెక్స్ట్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్!

  • February 20, 2024 / 10:50 AM IST

‘జాంబీ రెడ్డి’ ‘అద్భుతం’ ‘హనుమాన్’ వంటి చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు తేజ సజ్జ. ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. దీంతో తేజ సజ్జ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది అనే చెప్పాలి. ఇక ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమా కూడా రానుంది. ఇది 2025 లో వస్తుంది అని ప్రకటించినప్పటికీ.. ‘హనుమాన్’ కి దక్కిన ఆదరణ చూసి..

ఇంకా శ్రద్ధ పెట్టి ‘జై హనుమాన్’ ని రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. మరోపక్క తేజ సజ్జ ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ఓ సూపర్ హీరో సినిమా అనే ప్రచారం జరిగింది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. ఈ సినిమాకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం (Teja Sajja) తేజ సజ్జ- కార్తీక్ ఘట్టమనేని ప్రాజెక్టుకి..

‘మిరాయ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ.. దాదాపు ఈ టైటిల్ ఫిక్స్ అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus