మొహమాటాలకి పోయి ఏ పని చేయకూడదు అంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఫ్రెండ్స్ ని, బిజినెస్ ని అస్సలు కలపకూడదు అని అగ్ర నిర్మాతలు ఎక్కువగా చెబుతుంటారు. వాళ్ళు అలా ఎందుకు చెబుతారో అనుభవం వచ్చిన వాళ్ళకి బాగా తెలిసొచ్చింది. ఇవి ప్రత్యక్షంగా చూస్తే నిజమే అని ఎవ్వరైనా ఒప్పుకుంటారు. ‘స్నేహితుడు ఫ్లాపుల్లో ఉన్నాడు కదా సినిమా చేసి పెడదాం’ అని ఎవ్వరూ అనుకోకూడదు అనేది కూడా ఇండస్ట్రీ మాట.
కావాలంటే ప్రమోషన్ విషయంలో ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఇది ప్రస్తుతం తుచా తప్పకుండా పాటిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది తేజ సజ్జ(Teja Sajja) అనే చెప్పాలి. అవును తేజ సజ్జకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువే. అతని హీరోగా నిలబడింది కూడా ప్రశాంత్ వర్మ వంటి ఫ్రెండ్స్ వల్లే. ‘జాంబీ రెడ్డి’ ‘హనుమాన్’ సినిమాలతోనే తేజ హీరోగా నిలబడగలిగాడు. అలా అని ప్రతి సినిమాని తన ఫ్రెండ్స్ తోనే చేయాలి అనుకోలేదు.
‘హనుమాన్’ తర్వాత తేజకి చాలా నిర్మాణ సంస్థల నుండి అడ్వాన్సులు వచ్చాయి. అతని ఫ్రెండ్స్ లో టాప్ డైరెక్టర్లు ఉన్నారు.అయినప్పటికీ తేజ.. కార్తీక్ ఘట్టమనేని వంటి ఫామ్లో లేని దర్శకుడితో ‘మిరాయ్’ సినిమా చేశాడు. అది కూడా ఫెయిల్యూర్స్ లో ఉన్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో. ‘మిరాయ్’తో తేజ మార్కెట్ కూడా పెరిగింది. వాస్తవానికి హనుమాన్ తర్వాత తేజ విన్న కథల్లో ‘ఫంకీ’ కూడా ఉంది.
దర్శకుడు అనుదీప్ కేవీ కూడా తేజ స్నేహితుడే. అయినప్పటికీ తేజ.. ప్రొఫెషనల్ గానే బిహేవ్ చేసి ‘ఫంకీ’ని వద్దనుకున్నాడు.నిన్న రిలీజ్ అయిన ‘ఫంకీ’ ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ‘జాతి రత్నాలు’ కథ కూడా తేజ విన్నాడు.అది తనకి సెట్ అవ్వదు అని భావించి తప్పుకున్నాడు. నిజంగా నవీన్ పోలిశెట్టి నటించడం వల్లే ఆ సినిమా గట్టెక్కింది అనుకోవాలి.