ఎట్టకేలకు తెలుగు సినిమా సైన్ చేసిన తెలుగు హీరో
- January 30, 2019 / 12:21 PM ISTByFilmy Focus
దర్శకుడు తేజ, తమిళ హీరో విశాల్ కలిసి సినిమా చేయనున్నారు. తెలుగువాడైన విశాల్ తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులో అనువాదం అవుతూ విజయం సాధిస్తున్నాయి. పలు సందర్భాల్లో తెలుగులో సినిమా చేస్తాను అని విశాల్ చెప్పేవారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరిందని తెలిసింది. తేజ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. “నేనే రాజు నేనే మంత్రి” విజయంతో తేజ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకముందే తప్పుకున్నారు.
- పెద్ద హీరో అయితే ఓకే.. చిన్న హీరోకి షాకే..!
- శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ 4 ?
- హీరోయిన్ల పై ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సెటైర్లు..!
ఆ తర్వాత బెల్లంకొడ సాయి శ్రీనివాస్, కాజల్ నటిస్తున్న సీత చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తిచేశాక విశాల్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. విశాల్ కూడా తమిళంలో బిజీగా ఉన్నారు. “టెంపర్” రీమేక్ “ఆయోగ్య”లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్‌లో వీరి సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.















