బిగ్ బాస్ లో అడుగుపెట్టేది లేదంటున్న హీరోయిన్!

  • August 30, 2020 / 06:59 PM IST

అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. సెలెబ్రిటీల జీవితాలను దగ్గరగా చూపించే ఈ రియాలిటీ షోలోని గేమ్స్, వివాదాలు, రొమాన్స్, గిల్లికజ్జాలు భలే ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన ఈ రియాలిటీ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఈ షోలో పాల్గొనడానికి భారీగా పైరవీలు కూడా జరుగుతాయి. చాలా మంది బిగ్ బాస్ షో వలన ఫేమ్ వస్తుండని భావిస్తారు. కొందరు మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు.

తాజాగా ఈ లిస్ట్ లో నటి కల్పికా గణేష్ వచ్చి చేరింది. కల్పిక గణేష్ ని మీరు బిగ్ బాస్ లో పాల్గొంటున్నారట కదా అని అడుగగా ఆసక్తికర సమాధానం చెప్పింది. నేను బిగ్ బాస్ షోలో పాల్గొనడం అనేది ఎప్పటికి ఊహాగానంగా ఉండిపోవాల్సిందే. ఎందుకంటే నేను ఎప్పటికీ బిగ్ బాస్ షోలో పాల్గొనడం జరగదు అన్నారు. మరి కల్పిక అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. బిగ్ బాస్ షోకి వెళ్లొచ్చిన చాలా మంది నటులకు ఆశించినంత గుర్తింపు రాలేదు.

పైగా కొందరికి ప్రజల్లో ఉన్న అభిప్రాయం పోయి అసలుకే మోసం వచ్చింది. బిగ్ బాస్ వలన కెరీర్ కి ఒరిగేదీమీ లేదని కాబోలు అమ్మడుకి అసలు ఇష్టం లేదంటుంది. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి చిత్రాలలో కల్పిక కీలక రోల్స్ చేశారు. సీత ఆన్ రోడ్ మూవీలో హీరోయిన్ గా చేసింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus