Actress: తెలుగు నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

మహేష్ బాబు – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘అతిథి’ చిత్రంలో హీరోయిన్ అమృత రావు ఫ్రెండ్ పాత్రలో నటించి జనాలకు బాగా నోటెడ్ అయ్యింది మాథవీలత. ఆ తరువాత తనీష్ హీరోగా వచ్చిన ‘నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. అదే క్రమంలో నేచురల్ స్టార్ నాని తో చేసిన ‘స్నేహితుడా’ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది. అది కూడా పర్వాలేదు అన్నట్టు ఆడింది. అయితే ఆ చిత్రం తరువాత ఈమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి.

అటు పై అవకాశాలు కూడా కరువవ్వడం .ఇలాంటి టైములో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈమె సక్సెస్ కాలేకపోయింది. 2019 ఎన్నికల్లో బిజెపి పార్టీ తరుపున గుంటూరు నుండీ పోటీ చేసిన మాథవీలత ఘోరంగా ఓడిపోయింది. తాజాగా గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పి ఎమోషనల్ అయ్యింది ఈ బ్యూటీ. మాధవీలత మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నేను ఎవరినీ బాధ పెట్టను. కానీ టెంపర్‌ కోల్పోతే మాత్రం..

ఎదురుగా ఎవరు ఉన్నారు అనేది చూడను. మాటలు కూడా కంట్రోల్లో ఉండవు… ఏదో ఒకటి అనేస్తాను. నాకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సమస్యలు లేవు. ఈ విషయం ఎవరూ నమ్మరు. ఎవరైనా నిర్మాతనో.. మరో వ్యక్తో నాతో తప్పుగా మాట్లాడితే.. నేను అరవను. వారి మాటల వల్ల ఎంత కోపం వచ్చినా సరే.. శాంతంగానే బదులిస్తుండేదాన్ని. నేను మీరు అనుకునే మనిషిని కాదండని చెప్పి వెళ్లి పోతాను. ముందు రోజు.. వస్తావా..రాత్రికి వస్తావా అని వంకరగా మాట్లాడిన వాళ్లే..

మరుసటి రోజు నుంచి నన్ను (Actress) అమ్మ అని పిలిచిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు.నాకు మైగ్రేన్‌ సమస్య కూడా ఉంది. వినడానికి ఇది చిన్న ప్రాబ్లమే అనిపిస్తుంది. కానీ అనుభవించేవారికే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అందుకే నేను ఎప్పుడు టాబ్లెట్స్‌ వేసుకునేదాన్ని. అయితే ఓ రోజు ‘ప్రేమ’ సినిమా చూశాను. దానిలో రేవతి.. చీటికి మాటికి మాత్రలు మింగడం వల్ల.. చివరకు ఆమె మీద ఏ మందులు పని చేయని స్టేజ్‌కు వస్తుంది. అది చూసి.. భవిష్యత్తులో నాకు ఇలానే అవుతుందేమో అని కొంచెం టెన్షన్ వచ్చేది. డిప్రెషన్‌కు గురయ్యాను.

ఆ ఆలోచనతోనే.. చివ‌ర‌కు నాకు కూడా ఏ టాబ్లెట్ ప‌ని చేయ‌దేమోన‌ని పోస్ట్ పెట్టేసి ప‌డుకున్నాను. తెల్లారి నేను నిద్ర లేచేసరికి.. మీడియాలో నేను చనిపోబోతున్నాను అంటూ ప్రచారం జరిగింది. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కాల్‌ చేసి చెప్తే.. చూశాను. ఆ వార్తలు చూసి షాకయ్యాను. నేను నిద్ర లేచే సరికే ఇంత జరిగిందా అనుకున్నాను. లాక్‌డౌన్ కంటే ముందే నాకు డిప్రెష‌న్ వ‌చ్చేసింది. అప్పుడు అదింకా ఎక్కువైంది. ఆ స‌మ‌యంలో చ‌చ్చిపోవాల‌నిపించింది ” అంటూ చెప్పుకొచ్చింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus