తెలుగులో ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. గతంలో బిగ్ బాస్ షోలోకి రావడానికి సెలబ్రిటీలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు కరోనా సమయం కావడంతో షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని వార్తలొచ్చాయి. కానీ బిగ్ బాస్ నాల్గో సీజన్ తరువాత ఇండస్ట్రీలో ఉన్న చిన్న యాంకర్లంతా బిగ్ బాస్ వైపు చూస్తున్నారు. ఎవరికి వారు వారి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ 4లో పాల్గొన్న అవినాష్, అరియనా, మోనాల్ లాంటి వాళ్లకు సెలబ్రిటీ స్టేటస్ రావడంతో ఇప్పుడు తెలుగు యాంకర్లు కొంతమందికి బిగ్ బాస్ షో మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. బిగ్ బాస్ షో కోసం కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేసే వారి దృష్టిలో పడడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. కొందరు కావాలనే పొట్టి దుస్తులు వేసుకొని.. రకరకాల డాన్స్ లు చేస్తూ గిల్మర్ కంటెంట్ ను ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా..
టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న దుర్గారావుని కూడా బిగ్ బాస్ లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇత్తడితో పాటు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ పేరు కూడా బిగ్ బాస్ షో కోసం పరిశీలిస్తున్నారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!