Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ఘనంగా జరిగిన తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగ దొరస్వామిరాజు స్మారక పురస్కారాల ప్రదానం!

ఘనంగా జరిగిన తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగ దొరస్వామిరాజు స్మారక పురస్కారాల ప్రదానం!

  • February 8, 2021 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా జరిగిన తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగ దొరస్వామిరాజు స్మారక పురస్కారాల ప్రదానం!

“తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్” హాల్లో శనివారం సాయంకాలం “తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు వేడుక” ఘనంగా జరిగింది. హెచ్.ఎం.రెడ్డి తీసిన తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” తొలిసారిగా బొంబాయి కృష్ణా టాకీస్ లో 1932 ఫిబ్రవరి 6 వ తేదీన రిలీజ్ అయిందని తన సిద్ధాంత వ్యాసం తో ప్రముఖ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ నిరూపించడంతో.. 2016 వ సంవత్సరం నుంచీ ప్రతి ఏడాదీ తెలుగు సినిమా తల్లి పుట్టిన రోజును ఒక వేడుకగా “కళా మంజూష”అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఘనంగా జరపడం మొదలు పెట్టింది.

తెలుగు చిత్రసీమలో అత్యంత సీనియర్ నటులను .. నటీ మణులు ను.. దర్శకులను.. నిర్మాతలను.. మొదటిసారి భారీ ఎత్తున ఆ సంస్థ సత్కరించి ఒక కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్టులలో సీనియర్లను ఎంపిక చేసి సన్మానించింది. ఇలా ప్రతిసారి తెలుగు సినిమాకి సంబంధించిన ప్రముఖులకు సత్కారాలు చేయాలని తలపోసిన ఆ సంస్థకు ఆ తర్వాత “తెలుగు సినిమా వేదిక”, “నేస్తం ఫౌండేషన్” సంస్థలు తోడయ్యాయి.

ఇటీవలే మరణించిన ప్రసిద్ధ నిర్మాత- డిస్ట్రిబ్యూటర్- ఎగ్జిబిటర్ వి దొరస్వామిరాజు గారి పేరిట.. వారి “స్మారక పురస్కారాల”తో నలుగురు చిత్ర ప్రముఖు లను ఈ సభలో ఘనంగా సత్కరించారు.

ప్రసిద్ధ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ నిర్మాతలు ఎన్ ఆర్ అనురాధా దేవి, జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి, గొట్టిముక్కల సత్యనారాయణ రాజు గార్లు ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు.

ప్రసిద్ధ నిర్మాత..ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, ప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాతలు జి.ఆదిశేషగిరిరావు, ఏ.ఎం. రత్నం, దర్శక నిర్మాత ఎన్.శంకర్, ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, నటి కవిత, వి దొరస్వామిరాజు గారి కుమారుడు- నిర్మాత-నటుడు వి విజయ్ కుమార్ వర్మ, ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు, నటుడు-దర్శకుడు చిత్తరంజన్ తదితరులు ఈ సభకు అతిథులుగా హాజరయ్యారు.

సభకు హాజరైన ముఖ్య అతిథులతోపాటు నిర్వాహకులు..దర్శకులు బాబ్జీ, రామ్ రావిపల్లి, నిర్మాతలు ఏ. గురురాజ్, విజయ్ కుమార్ వర్మ, పాకలపాటి విజయ వర్మ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ,సాయి వెంకట్, మోహన్ గౌడ్, ఫిల్మ్ స్కూల్ ఉదయ్ కిరణ్, జర్నలిస్ట్ రెంటాల జయదేవ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.

ఇక పై ‘ఫిలిం చాంబర్” ఆధ్వర్యంలో.. “ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్”, “తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్” “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్” ఇలాంటి సంస్థల నేతృత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు సినిమా తల్లికి కనీసం వారం రోజుల పాటు జన్మదినోత్సవాన్ని జరపాలని..అందుకు మనందరం కృషి చేయాలని పలువురు పెద్దలూ ఆకాంక్షించడం విశేషం.

నిర్వాహకుల్లో ఒకరైన నటుడు దర్శకుడు రామ్ రావి పల్లి సభను ఆద్యంతం రసరమ్యంగా నడిపించారు. ఆయన తన వాయిస్ ఓవర్ తో రూపొందించిన వి దొరస్వామిరాజు గారి బయోగ్రాఫికల్ రీల్ (ఏవి), సన్మానితుల పరిచయ చిత్రం(ఏవి) అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

తదనంతరం చిత్ర ప్రముఖులంతా కలిసి.. తెలుగు సినిమా తల్లి బర్త్ డే కేక్ కట్ చేసి..ఆమె జన్మదినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కిక్కిరిసిన ప్రేక్షకులతో సభ నిండుగా కొనసాగింది!!

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaktha Prahalada
  • #HM Reddy
  • #Movies
  • #Tammareddy Bharadwaja
  • #Telugu Cinema

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

2 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

13 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

16 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

18 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

16 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

20 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

20 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

1 day ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version