Shaktimaan: శక్తి మాన్ ప్రాజెక్ట్ కోసం తెలుగు హీరో?

90ల కాలంలో చిన్నారులను ఎక్కువగా ఆకట్టుకున్న టెలివిజన్ సిరీస్ శక్తిమాన్ ప్రధానమైంది అని చెప్పాలి. ముఖేష్ కన్నా శక్తిమాన్ లో కనిపించిన విధానం అప్పట్లో చిన్నారులను మాత్రమే కాకుండా పెద్దలను కూడా ఎంతో ఆకట్టుకుంది.. అయితే ఇప్పుడు ప్రముఖ సోనీ పిక్చర్స్ ఆ కాన్సెప్ట్ లో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఇటీవల అధికారికంగా కూడా ఒక ప్రకటన ఇచ్చారు. దాదాపు వెయ్యి కోట్లతో మూడు భాగాలుగా వెండి తెర పైకి తీసుకు రాబోయే అవకాశం ఉంది.

Click Here To Watch

ఇక ఈ సినిమాల్లో హీరో ఎవరు నటిస్తారనే అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక శక్తిమాన్ అంటే దాదాపు అందరికీ తెలిసిన పేరు కాబట్టి ఈ సినిమా కూడా తెరపైకి తీసుకు వస్తే అందరికీ తెలిసిన నటీనటులు ఉంటేనే దేశమంతా సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎక్కువగా సినిమాలు చేస్తున్న హీరోలు తెలుగువారు వుండడం విశేషం. అందులో ప్రధానంగా చెప్పుకుంటే ప్రభాస్ అయితే ప్రస్తుతం పాన్ ఇండియా వరల్డ్ అనే స్థాయికి కూడా సినిమాలు చేస్తున్నాడు .

దీంతో ముఖ్యంగా సోనీ పిక్చర్స్ అతనివైపు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ప్రభాస్ అయితే గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రెండు మూడు ప్రాజెక్టులు పూర్తయితే గాని ప్రభాస్ నుంచి డేట్లు తీసుకోవడం సాధ్యపడదు. ఇక ఇటీవల బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ పైన కూడా సోనీ పిక్చర్స్ ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పుష్ప సినిమా బాలీవుడ్ లో వంద కోట్ల వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే.

కాబట్టి ప్రభాస్ లేదా అల్లు అర్జున్ అనే ఆలోచనతోనే సోనీ పిక్చర్స్ ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది కాబట్టి దాదాపు అన్ని భాషల్లోనూ అలాగే విదేశీ భాషల్లోనూ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే సోని పిక్చర్స్ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనుంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus