Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

‘బృందావనం’ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ అన్నట్టు సాగింది. ‘శక్తి’ ‘ఊసరవెల్లి’ ‘దమ్ము’ ‘రామయ్యా వస్తావయ్యా’ ‘రభస’ వంటి డిజాస్టర్లు వచ్చాయి. ‘బాద్ షా’ బాగానే ఆడింది. ఆ సినిమా తీసేస్తే.. ‘రభస’ వరకు ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్స్ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి టైంలో ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అంటే.. అంచనాలు ఉంటాయా? ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో ‘ఆంధ్రావాలా’ వంటి డిజాస్టర్ వచ్చింది.

Temper

కాబట్టి పెద్దగా క్రేజ్ లేని కాంబో ఇది. అయినప్పటికీ ధైర్యం చేసి ఓ ప్రాజెక్టు చేశారు. అదే ‘టెంపర్’. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ మేకోవర్ తో కొంత ఆసక్తి పెరిగింది. అయితే ఫిబ్రవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నేటితో ‘టెంపర్’ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒకసారి ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 11.2 cr
సీడెడ్ 6.25  cr
ఉత్తరాంధ్ర 3.55 cr
ఈస్ట్ 2.2 cr
వెస్ట్ 1.75 cr
గుంటూరు 3.02cr
కృష్ణా 2.08 cr
నెల్లూరు 1.3 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 31.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.5 cr
ఓవర్సీస్ 5.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 43.1 cr(షేర్)

‘టెంపర్'(Temper) సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.42 కోట్లు రాబట్టాలి. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.43.1 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.1.1 కోట్ల మైనర్ ప్రాఫిట్స్ తో సినిమా క్లీన్ హిట్ అనిపించుకుంది. అన్ సీజన్ కావడంతో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది. వేరే సీజన్లో కనుక వచ్చి ఉంటే.. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో..!

నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

 

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus