Skanda Movie: స్కంద సినిమాలోని ఆ సీన్లలో బోయపాటి మార్క్.. ఆ సీన్లను గుర్తు చేస్తారంటూ?

  • September 1, 2023 / 06:12 PM IST

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలు ఇతర డైరెక్టర్లకు భిన్నంగా ఉంటాయి. బోయపాటి శ్రీను సినిమాలు అంటే అభిమానులు అద్భుతమైన యాక్షన్ సీన్లను ఆశిస్తారు. మరోవైపు అఖండ సక్సెస్ తర్వాత తెరకెక్కిన సినిమా కావడంతో స్కంద సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోషన్ పెళ్లిసందడి, ధమాకా సినిమాలతో విజయాలను అందుకున్న శ్రీలీల ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్కంద సినిమాలో శ్రీలీల రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.

స్కంద సినిమాలో (Skanda Movie) చివరి 20 నిమిషాలు అరాచకం అని ఈ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. స్కంద సినిమాలోని ఆ సీన్లలో బోయపాటి మార్క్ ఉండనుందని సమాచారం అందుతోంది. లెజెండ్, అఖండ సినిమాల ఇంటర్వెల్, క్లైమాక్స్ లను గుర్తు చేసేలా ఈ సినిమా క్లైమాక్స్ ఉండనుందని సమాచారం అందుతోంది. స్కంద సినిమా కమర్షియల్ గా ఇప్పటికే భారీ లాభాల్లో ఉంది. బోయపాటి శ్రీను డైరెక్షన్, శ్రీలీల హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు బిజినెస్ పరంగా కలిసొచ్చాయి.

బీ, సీ సెంటర్స్ లో ఈ సినిమా కలెక్షన్లు భారీగా ఉండనున్నాయని తెలుస్తోంది. స్కంద సినిమా ఓవర్సీస్ డీల్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. రామ్ పోతినేని ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కు కూడా భారీ స్థాయిలో ఆఫర్లు వస్తాయి. వచ్చే సంవత్సరం మహా శివరాత్రి కానుకగా డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ కానుంది.

కొన్ని నెలల గ్యాప్ లోనే రామ్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. హీరో రామ్ కు వరుస విజయాలు దక్కాలని పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus