Chiranjeevi: తెరువెనుక గాడ్ ఫాదర్ ను నడిపించింది ఆ స్టార్ హీరో నేనా?

  • September 29, 2022 / 07:46 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఎన్నో అంచనాల నడుమ విజయదశమి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెలప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని మలయాళంలో సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ద్వారా చిరంజీవి తెరపై మనకు కనిపించినప్పటికీ తెర వెనుక మాత్రం ఈ సినిమాని ముందుకు నడిపించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి ఈ సినిమా వెనక ఉండి సినిమాని ముందుకు నడిపించింది రామ్ చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమాని చూడమని రామ్ చరణ్ తనకు సలహా ఇచ్చారని ఆ సినిమా రీమేక్ చిత్రంలో తాను పర్ఫెక్ట్ గా సరిపోతానని రామ్ చరణ్ తనకు సూచించారని తెలిపారు. అదేవిధంగా ఈ సినిమాకు మోహన్ రాజాని ఎంపిక చేయడం నుంచి నిర్మాతలు అందరిని ఒకే తాటిపై తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడం వెనుక రామ్ చరణ్ ప్రమేయం ఉందని మెగాస్టార్ వెల్లడించారు.

రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ తో మాట్లాడి తనని ఒప్పించి ఈ సినిమాలో నటించేలా చేశారు.ఇలా గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ప్రతి ఒక్కటి రాంచరణ్ దగ్గర ఉండి చూసుకున్నారని తెర ముందు ప్రేక్షకులకు చిరంజీవి కనిపించినా తెరవెనక ఈ సినిమాని నడిపించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచి చూడాలి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus