ఆర్ ఆర్ ఆర్ టైటిల్ అదే అయితే ఆ మూడో వ్యకి ఎవరు?

  • March 2, 2020 / 06:52 AM IST

బాహుబలి విజయం తర్వాత దర్శకుడికి మించి గొప్ప మార్కెటింగ్ స్కిల్స్ తనలో ఉన్నాయని రాజమౌళి నిరూపించుకున్నారు. ఆయనకున్న క్రేజ్ రీత్యా తన ప్రమోషనల్ టెక్నిక్స్ సూపర్ సక్సెస్ అవుతాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనే ఒక్క ప్రశ్నతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇక తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ విషయం టైటిల్ తో ఓ పజిల్ క్రియేట్ చేసి అభిమానులకు పరీక్ష పెట్టాడు.

ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ఇదేనంటూ అనేక పేర్లు వినిపించాయి. వాటిలో ప్రముఖంగా రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్ అనే టైటిల్స్ వినిపించాయి. కాగా ఈ రెండింటిలో రాజమౌళి రఘుపతి రాఘవ రాజారామ్ అనే టైటిల్ కి ఫిక్స్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన ఈ దేశభక్తి గీతంలోని మొదటి పదాలు పెట్టడం కలిసొచ్చే అంశం అని ఆయన భావిస్తున్నారట. ఐతే ఈ పాటలో మూడు పేర్లు ఉన్న తరుణంలో మరో పేరు ఏ హీరోకి అనే అనుమానం కలుగుతుంది. ఒక ఆ మూడో పేరు అజయ్ దేవగణ్ కి ఇచ్చాడా అనిపిస్తుంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus