డైరెక్టర్ తో సావాసమే ఆమె సక్సెస్ కు కారణమా!

హీరోయిన్ గా రాణించాలంటే అందం, అదృష్టం మాత్రమే కాదు పరిచయాలు కూడా ఉండాలి. అవన్నీ ఉన్నా ఆఫర్లు దొరక్క ఇబ్బందిపడే దర్శకులు కొందరుంటే.. అవేమీ లేకుండా కూడా అగ్ర కథానాయికలుగా ఎదిగిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అందుకు కారణం కేవలం కొందరు పరిశ్రమ పెద్దలతో పరిచయాలు మాత్రమే. అందరూ అలా ఉండరనుకోండి.. కొందరు మాత్రమే ఈ విధంగా సావాసలతో సక్సెస్ బాట పడతారు.

అలా ఓ కొత్త హీరోయిన్ ఓ సీనియర్ డైరెక్టర్ కి తొలుత హీరోయిన్ గా పరిచయమై తర్వాత అతడ్ని బుట్టలో వేసుకొని.. ప్రస్తుతం ఆ డైరెక్టర్ వర్క్ చేస్తున్న బేనర్లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రెజంట్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరూ అమ్మడి వేగానికి షాక్ అవుతున్నారు. అసలు ఈమెకు ఇన్ని వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయో అర్ధం కాక తలలు కొట్టుకొంటున్నారు. అయితే.. ఆ హీరోయిన్ మాత్రం వరుసబెట్టి స్టార్ హీరోల సరసన సినిమాలు సైన్ చేస్తూ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తుంది. ఇదివరకు కూడా ఓ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఈ తరహా వ్యవహారాలు నడిపిన ఈ స్టార్ డైరెక్టర్ ఈ కొత్తమ్మాయితో వ్యవహారం ఎన్నాళ్లు నడుపుతాడో తెలియదు కానీ.. ప్రస్తుతం వీరిద్దరి రిలేషన్ ఫిలిమ్ నగర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus