‘బంగార్రాజు’ ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలతో ఫామ్లో ఉన్న అక్కినేని నాగార్జున హీరోగా రాబోతున్న చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ మూవీగా ఈ మూవీ రూపొందింది. ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. అందుకే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
5.50 cr
సీడెడ్
2.50 cr
ఉత్తరాంధ్ర
2.25 cr
ఈస్ట్
1.50 cr
వెస్ట్
1.40 cr
గుంటూరు
1.60 cr
కృష్ణా
1.40 cr
నెల్లూరు
0.65 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
16.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
4.00 cr
ఓవర్సీస్
2.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
22.80 cr
‘ది ఘోస్ట్’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.22.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హిందీలో ఈ చిత్రం విడుదలను చివరి నిమిషంలో వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తమిళ్ లో కూడా రిలీజ్ అవుతుంది అంటున్నారు. వాటి వివరాలు మాత్రం బయటకు రాలేదు. తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘గాడ్ ఫాదర్’ పోటీగా ఉంది కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.