The Ghost OTT: ఓటీటీకి ‘ది ఘోస్ట్’ ఎప్పటినుంచో తెలుసా?

Advertisement

అక్కినేని నాగార్జున హీరోగా ‘గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలిసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా సందడి చేయలేకపోయింది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినప్పటికీ ఎడతెగకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రేక్షకులు ఈ మూవీ చూడలేకపోయారు. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో మిస్ కాకుండా చూడాలని అంతా ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ‘ది ఘోస్ట్’ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ది ఘోస్ట్’ నవంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ కాబోతుందన్న మాట. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

యాక్షన్ ఎపిసోడ్స్, నాగార్జున టెరిఫిక్ యాక్టింగ్, చర్చ్ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్ కచ్చితంగా యాక్షన్ ప్రియులను, మాస్ ఆడియన్స్ ను ఫిదా చేస్తాయి. పాటలు మాత్రమే పెద్దగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus