Bimbisara,Kanguva: బింబిసార కంగువా సినిమాల మధ్య లింక్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

గతేడాది విడుదలైన బింబిసార సినిమా అంచనాలను మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు నటుడిగా కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ కు సైతం మంచి మార్కులు పడ్డాయి.
అయితే బింబిసార మూవీ కథకు కంగువా కథకు లింక్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

కంగువా (Kanguva) సినిమా కూడా గతానికి, వర్తమానానికి లింక్ చేసేలా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కంగువా సినిమా అన్ని భాషల హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సూర్య ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత కొన్నేళ్లలో సూర్య నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఓటీటీలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినా థియేటర్లలో విడుదలైన సినిమాలు మాత్రం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.

సూర్య తన ఆటిట్యూడ్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. సూర్యకు భారీ విజయాలు దక్కాలని అన్ని భాషల ప్రేక్షకులు కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. సూర్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ఒక పాత్రలో సూర్య క్రూరమైన రాజుగా కనిపించనున్నారని వర్తమానంలో సూర్య క్లాస్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సూర్య ఓకే చెబుతున్నారు.

సూర్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. భిన్నమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు చారిత్రక కథలకు సూర్య ప్రాధాన్యత ఇస్తున్నారు. కంగువా సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus