ఇప్పుడు ఎక్కడ చూసినా సీనియర్ యాక్టర్ నరేష్ కు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను ఇతను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. ఆ తర్వాత ఇతని మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి చేసిన హడావుడి కూడా అంతా ఇంతా కాదు. నరేష్ కు ఎంతో మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని..
ఈ విషయం అతని తల్లి.. దివంగత స్టార్ డైరెక్టర్ మరియు హీరోయిన్ అయిన విజయ నిర్మలకి తెలుసనీ, కేవలం ఆమె మొహం చూసే నేను కంట్రోల్ లో ఉండేదానినని చెప్పుకొచ్చింది. దీనికి ముందు ఆమె కొంతమంది సినీ ప్రముఖుల వద్ద డబ్బు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సంగతి అందరూ మర్చిపోయి పవిత్ర, లోకేష్ ల వ్యవహారం పై పడ్డారు. ఆ విషయం నుండి జనాలను డైవర్ట్ చేయడానికి అనుకుంట.
సరే ఈ విషయాలను వదిలేసి అసలు మేటర్ కు వద్దాం. నరేష్ మూడో భార్య రమ్యకు.. కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు బంధుత్వం ఉందట. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ. విషయంలోకి వెళ్తే.. రమ్య ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిరలోని నీలకంఠపురం గ్రామానికి చెందిన మహిళ. సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, రమ్య తండ్రి వరుసకు అన్నదమ్ములు. ఇక, కేజీఎఫ్ దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్‌కు రమ్య సోదరి అవుతుంది.
ప్రశాంత్ నీల్ తండ్రి, రమ్య తండ్రి అన్నదమ్ములు. వీరి కుటుంబాలు దశాబ్దాల క్రితమే కర్ణాటకకు వలస వెళ్లిపోయాయయట. ‘హోటల్ మోతీ మహాల్’ బెంగుళూరులోని ఫేమస్ హోటల్. దీనికి ఓనర్ రమ్య తండ్రి అని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. మరోపక్క ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!