Trivikram: ‘వరుడు కావలెను’ లో త్రివిక్రమ్ హ్యాండ్… నాగశౌర్య షాకింగ్ కామెంట్స్..!

నాగశౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. అక్టోబర్ 29న(రేపు) విడుదల కాబోతుంది ఈ చిత్రం.ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్, ప్రోమోస్ అన్నీ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. దాంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా హీరో నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రం కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సన్నివేశాన్ని కూడా రాసినట్టు అతను తెలియజేసాడు. నాగశౌర్య మాట్లాడుతూ… “త్రివిక్రమ్ గారు ప్రి రిలీజ్ ఈవెంట్ కి రావడం,మా సినిమా గురించి చెప్పడం నాకు చాలా గొప్పగా అనిపించింది.మా సినిమాలో త్రివిక్రమ్ గారు ఓ సీన్ కూడా రాశారు. ఆ సీన్ లో నేను యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన రాసిన డైలాగులు నా నోటితో చెప్పాను.

అంతకంటే ఆనందం మరొక్కటి లేదేమో అని ఆ టైములో అనిపించింది. ఈ సినిమాలో ఒక పదిహేను నిమషాల ప్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆడియన్స్ కు అది చాలా ఫ్రెష్ గా ఫీల్ ని ఇస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్లు వంటివి అన్న సంగతి తెలిసిందే.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus