Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

సినీ పరిశ్రమలో(Tollywood) నిలదొక్కుకోవడమే చాలా కష్టం. అలాంటిది స్టార్‌గా ఎదగాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలో చెప్పండి. స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చినంత మాత్రాన స్టార్స్ అయిపోరు. ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసే చరిష్మా ఉండాలి. ఆడియన్స్ వాళ్లను ఓన్ చేసుకోగలగాలి. అప్పుడే వాళ్ల సినిమాలకు టికెట్లు తెగుతాయి, స్టార్ స్టేటస్ దక్కుతుంది. ప్రస్తుతం స్టార్ స్టేటస్ కోసం పరితపిస్తున్న ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను చూస్తూనే ఉన్నాం.

Tollywood

ఆ విషయాలు పక్కనపెట్టి కొంచెం గతంలోకి వెళితే.. ఇద్దరు నటులు కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వంటివి చేసి ఆ తర్వాత హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత తమ బాక్సాఫీస్ స్టామినాతో స్టార్స్‌గా ఎదిగారు. వాళ్లు మరెవరో కాదు.. మోహన్ బాబు, రాజశేఖర్. మోహన్ బాబు అప్పట్లో నెగిటివ్ రోల్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్నారు. హీరోగా కూడా విలక్షణమైన సినిమాలు చేసి స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు.

చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న టైంలో.. మోహన్ బాబు కూడా హీరోగా తన మార్క్ చూపించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మోహన్ బాబు సినిమాలు కూడా ఆ నలుగురు స్టార్ హీరోల సినిమాల మాదిరి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు రాజశేఖర్ కెరీర్ గ్రాఫ్ కూడా దాదాపు మోహన్ బాబు కెరీర్ గ్రాఫ్‌కు ఈక్వల్‌గా ఉంటుంది.

ఈ ఇద్దరు హీరోలకు ఉన్న ఇంకో సిమిలారిటీ ఏంటంటే.. వీరిద్దరికీ ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువగా ఉండటం. అవును, మోహన్ బాబు, రాజశేఖర్ ఇద్దరూ ముక్కుసూటి మనుషులు. మోహన్ బాబు అయితే భోళా మనిషి. ఎవరైనా డిసిప్లిన్ తప్పితే.. తిట్టడం మాత్రమే కాదు, చెయ్యి చేసుకోవడానికి కూడా వెనుకాడరు. తన నైజం వల్ల మోహన్ బాబు చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. రాజశేఖర్ కూడా అంతే..! ఆయనకు (నిజ జీవితంలో) నటించడం రాదు.

తప్పు చేసినవాళ్లు ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే.. వాళ్ల తప్పును వేలెత్తి చూపిస్తారు. ఆ స్టార్స్ అభిమానులకు కూడా భయపడరు. అందుకే ఫ్యామిలీతో కలిసి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. ప్రస్తుతానికైతే ఇద్దరూ పెద్ద సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేస్తూ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus